- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. ప్రభుత్వానికి శ్రీధర్ బాబు వార్నింగ్
దిశ, భూపాలపల్లి: గిరిజనులు, ఆదివాసీలు గత 30 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ.. భూపాల్‌పల్లి జిల్లాలోని పలు గిరిజనులు, ఆదివాసీలు ఆ భూములనే నమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు. 1960కి సంబంధించిన మ్యాప్‌ను పట్టుకుని అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై దాడులు చేసి లాక్కుంటున్నారని ఆరోపించారు. గిరిజనులు పండించిన పంటను నాశనం చేసి, వారికి నష్టం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని, నేడు ఆ భూములను సైతం ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం దారుణం అన్నారు. ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల విషయంలో అనేకసార్లు ముఖ్యమంత్రికి వివరించామని, అయినా వారిపై దాడులు ఆగడం లేదని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ఆదివాసీ, గిరిజనులకు భూములపై హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.