- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో కోలుకోరు.. మీడియాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్
దిశ, మహబూబాబాద్: కొంతమంది వార్తలు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు.. శంకర్ నాయక్ వార్త రాస్తే జీవితంలో కోలుకోరు అని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్లు మీడియా రాయకుండా, అడిగి రాయాలని సూచించారు. శంకర్ నాయక్‌కు రాజకీయం కొత్త కాదు.. కేసులు కొత్త కాదు.. అన్ని ఢక్కాముక్కీలు తినే ఈ స్టేజిలో ఉన్నానని తెలిపారు. అనవసరంగా పిచ్చి వార్తలు రాయకండి.. నిజం ఉంటే తెలుసుకొని రాయండి.. శిరసా వహిస్తా.. కానీ, ఇష్టం వచ్చినట్లు రాస్తే ఉరుకోను.. సీరియస్‌గా ఉంటది. ఇది రిక్వెస్ట్ కాదు.. వార్నింగే. నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మీడియాలకు అతీతంగా అందరినీ చూసుకుంటున్నా.. దయచేసి రెచ్చగొట్టకండి అని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.