పాడి కౌశిక్ రెడ్డి మోసగాడు.. సీతక్క ఆగ్రహం

by Shyam |
MLA Seethakka
X

దిశ, కమలాపూర్: టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలో సీతక్క మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన మోసగాడు కౌశిక్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నిక, హుజురాబాద్ ఉప ఎన్నికనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలలుగన్న పరిపాలనను టీఆర్ఎస్, బీజేపీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో అభివృద్ధి, వసతులు కల్పించారని, కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టుతోందని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఒక్కసారి చూడాలని కోరారు. హుజురాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ యువకుడని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడే తత్వం ఉన్నవ్యక్తి అని అన్నారు. వెంకట్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఇచ్చారు.

Advertisement

Next Story