- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ మీటింగ్ ఏర్పాట్లలో సీతక్క బిజీబిజీ..
దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి స్థలంలో గురువారం జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో జరిగే సమావేశ స్థలాన్ని, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేముల నరేందర్ రెడ్డి, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భూపాల్ పల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భూపాల్‌పల్లి గ్రామంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని, దళితులకు హామీ ఇచ్చిన మూడెకరాల భూమి, దళిత బంధు పథకం రాష్ట్రమంతటా వర్తింప చేయలేదన్నారు. ప్రభుత్వం చేసే అరాచకాలు ప్రజలకు తెలియజేసేందుకు ఈ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వివరించారు. రేపు జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను సీతక్కతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, నాయకులు గండ్ర సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేందర్, దొమ్మటి సాంబయ్య రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.