నేషనల్ హైవే పనుల‌పై ఎమ్మెల్యే సమీక్ష..!

దిశ‌, కొత్త‌గూడెం : భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలోని రామవరం నుంచి పెద్దమ్మ గుడి వరకు సెంట్రల్ లైటింగ్ ప‌నుల‌ను వెంటనే పూర్తి చేయాల‌ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధ‌వారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నేషనల్ నేషనల్ హైవే, మున్సిపల్ అధికారులతో వనమా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ డివైడర్లు, స్వాగత ద్వారాలపై అధికారులతో చర్చించారు. పెండింగ్ వ‌ర్క్‌ల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని వనమా సూచించారు.

Advertisement