- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతులు అధైర్య పడొద్దు’
దిశ, ఖమ్మం: పంట కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ అధైర్య పడొద్దని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు భరోసా ఇచ్చారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వల్ల రైతాంగానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, అధైర్య పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచ్ సిరిపురపు స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, సుబ్రహ్మణ్యం, రైతులు పాల్గొన్నారు.
tags: burgampadu, rega kantha rao, MLA, crop buy centre, corona, virus, farmer, trs, mro