- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
దిశ, ఖమ్మం: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. జిల్లాలోని జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న నేపథ్యంలో సాగు పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక ఇబ్బందులతో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బుర్ర రాజశేఖర్, సహకార సంఘం చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: mla ramulu nayak, sweet corn buying centre, opening, khammam