‘ఎమ్మెల్యే వస్తే బయటకు రావా.. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచెయ్’

by Sridhar Babu |   ( Updated:2021-08-09 22:38:24.0  )
TRS MLA Ramulu Naik
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం గంపెళ్లగూడెంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ మంగళవారం ఉదయం పర్యటించారు. గ్రామంలో పారిశుధ్య పనులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. పంచాయతీ కార్యదర్శి నగేశ్‌ను హెచ్చరించారు. ‘‘పారిశుధ్య నిర్వాహణకు ఏం చేస్తున్నావు. ఎమ్మెల్యే వస్తే రూంలోంచి బటయకు రావాలని తెలియదా. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచెయ్. పద్ధతి మార్చుకోకపోతే బదిలీపై జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తా.’’ అని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ శకుంతల, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story