‘ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం’

by Shyam |   ( Updated:2020-07-15 08:21:55.0  )
‘ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం’
X

దిశ, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం కొత్తలూరు వాగువద్ద రూ.3 కోట్ల 44 లక్షల వ్యయంతో మంజూరైన చెక్ డ్యామ్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే నోముల నరసింహయ్య బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఈ సందర్భంగా నరసింహయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నేరవేరుస్తుందన్నారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం వల్ల ఎటువైపు నుంచి చూసిన 10 కిలోమీటర్లు దూరంలో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో 14ఏండ్ల క్రితం 180 బోర్లు వేసిన నీటి బొట్టు కూడా కనిపించేది కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ.7000 కోట్లు విడుదల చేశారని, అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రూ.150కోట్లు విడుదల చేశారన్నారు.

Advertisement

Next Story