వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనదే

by Shyam |
MLA Madhavaram Krishna Rao
X

దిశ, కూకట్‌పల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మూసాపేట్‌లో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్​కుమార్, జోనల్​ కమిషనర్​ మమత, డీసీ రవి కుమార్, కార్పొరేటర్‌లతో కలసి కృష్ణారావు మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ… పర్యవరాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంటుందని అన్నారు. అడవులు అంతరించిపొవడంతో ప్రాణవాయువు లేక జీవరాశి ఇబ్బంది పడుతుందని, ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకుని మొక్కలను నాటి వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ప్రాణవాయువును అందించే చెట్లనుభావి తరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాస్ రావు, ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బాబురావు, తూము శ్రవణ్ కుమార్, కాండూరి నరేంద్ర చార్య, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed