కాళేశ్వరం నీటితో జలకళ: మదన్ రెడ్డి

by Shyam |
కాళేశ్వరం నీటితో జలకళ: మదన్ రెడ్డి
X

దిశ, మెదక్: కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనుల తీరును ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటల్లో నీరు నింపేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తద్వారా చిన్న, సన్నకారు రైతులందరికీ సులభంగా సాగు నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story