తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా 

by Shyam |
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా 
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు కరోనాతో పోరాడుతుండగా మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా సోకింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ టీఆరెస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story