- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే బీజేపీలో చేరుతా :కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
దిశ ప్రతినిధి, నల్లగొండ: త్వరలోనే బీజేపీలో చేరుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీనే ప్రత్యామ్నాయం అని మొదటిసారిగా చెప్పిన వ్యక్తిని తానేనన్నారు. 2019 సంవత్సరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చానని గుర్తు చేశారు. ఇప్పటికీ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపారు. వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారని, వారు ఎంతవరకు గెలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రజల క్షేమం, ప్రజాస్వామ్యం కోసం పాటుపడాలని, తెలంగాణ ఆత్మశాంతి కలిగేలా కేసీఆర్ ప్రజలందరినీ కలుపుకుపోవాలని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలపడాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు.