హాస్యనటుడు, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

by Shamantha N |
హాస్యనటుడు, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను సైతం హడలెత్తిస్తోంది. ఇప్పటికే చాలా వరకు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ హాస్య నటుడు, ఎమ్మెల్యే కరుణస్‌కు వైరస్ సోకింది.

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో నివాసం ఉంటున్న కరుణస్ తిరువడనై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల తన ఇంట్లో వాచ్ మెన్ కి కరోనా సోకింది. దీంతో కరుణస్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. వ్యాధి నయం అయ్యే వరకు కరుణస్ హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అతడితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులు రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed