- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలినడకన ఛత్తీస్‌గఢ్‌కు ప్రయాణం.. నిలువరించిన ఎమ్మెల్యే
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నుంచి పలువురు వలస కూలీలు మంగళవారం కాలినడకన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తుండగా మణుగూరు వద్ద ఎమ్మెల్యే రేగ కాంతారావు నిలువరించారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. వలస వెళ్లిన ఊరిలో కనీస వసతులు లేవని, తినడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూలీలు ఎమ్మెల్యేతో గోడు వెళ్లబోసుకున్నారు. లాక్‌డౌన్ ముగిసేంత వరకు కూలీలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఎమ్మెల్యే సూచించారు. కలెక్టర్ ఎంవీరెడ్డి, ఏఎస్పీతో మాట్లాడి సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రస్తుతానికి తన క్యాంపు కార్యాలయానికి ఎదుట ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఉండాలని కూలీలకు సూచించారు. వారికి అల్పహారంతోపాటు భోజన వసతి ఏర్పాటు చేశారు.
Tags: Bhadradri, Mla Kantha Rao, migrant, workers