- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి పితృవియోగం..
దిశ, వెబ్‌డెస్క్ : పొదలకూరు ప్రాంత ప్రజలు గౌరవంగా పెద్దాయన అని పిలుచుకునే రాజకీయ కురువృద్ధులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి ఇక లేరు. వివాద రహితుడు, ముక్కుసూటి మనిషి, అజాత శత్రువుగా పేరొందిన కాకాణి రమణారెడ్డి (89)అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఈయనకు సీనియర్ నాయకులుగా పేరుంది.
ఆనం కుటుంబానికి రాజకీయాల్లో ఆయన కుడిభుజంగా వ్యవహరించారు. ఏసీ సుబ్బారెడ్డి కాలం నుంచి నేటి తరం ఆనం రామనారాయణ రెడ్డి వరకు పొదలకూరు, రాపూరు ప్రాంతాల్లో రాజకీయం అంతా ఆయన చేతుల మీదుగానే జరిగింది.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాసేవలో జీవితాంతం గడిపిన గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డారు. పొదలకూరు సమితి అధ్యక్షునిగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలంగా పని చేశారు.