- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనం హల్చల్.. భూకబ్జాపై ఎమ్మెల్యే, కలెక్టర్ ఆరా
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట బైపాస్ రోడ్డు పక్కన గల సర్వే నెం.142లో సుమారు 3 ఎకరాల భూమి కబ్జా కావడంపై దిశ దినపత్రిక మంగళవారం ‘అసైన్డ్ భూమికి ఎసరు’ అనే పేరుతో శీర్షికను ప్రచురించింది. దీనికి పలు కుల సంఘాలు, రాజకీయపార్టీల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కథనంతో నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి స్పందించి అసైన్డ్ భూమి అక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించడంతో పాటు రూరల్ సీఐను ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్, రూరల్ తహసీల్దార్ కేసు విచారణ కోసం ఢిల్లీకి వెళ్లడంతో గురువారం వచ్చిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పీవోటీ చట్టం ప్రకారం భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు అధికారులు తెలిపినట్లు తెలిసింది.
రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చామని ఓ ఆడియో హల్చల్
ఇది ఇలా ఉండగా.. దిశ కథనం వాట్సప్ గ్రూప్‌లో సంచరిస్తుండగా.. భూ అక్రమణకు సంబంధించి ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో వాట్సప్ గ్రూప్‌లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆడియోలో రెవెన్యూ అధికారులకు 10 లక్షలు ముట్టజెప్పామని, ఇక ఎవరు అపలేరని, సమస్య సుఖాంతామైనట్లు ఇద్దరు వ్యక్తుల మాట్లాడుకున్న ఆడియో అందరని ఆశ్ఛర్య పరిచింది.
అక్రమించుకున్న భూమిని పేదలకు ఇవ్వాలి: ఎదురు గట్ల చిట్టిమల్లు, బేడ బుడగ జంగం సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
దిశ పత్రికలో వచ్చిన అక్షరాలు నూటికి నూరుపాళ్లు సత్యం. ప్రభుత్వ భూములను అక్రమించుకున్నవాటిపై కథనాలు రాస్తున్న దిశకు మా సంఘం తరపున కృతజ్క్షతలు తెలుపుతున్నా. నాయుడుపేట బైపాస్ లో గల సర్వే నెంబర్ .142లో ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని సత్యనారాయణపురం గ్రామంలో బేడబుడగ జంగాల ఏసీ (SC) వాళ్లకు చిన్న తండా , తాళ్ళే సే తండా లంబాడీలు, యస్ టీ (ST ) గిరిజన వాళ్లకు, వరంగల్ క్రాస్ రోడ్ ఎదులాపురం దళితులులు యసి (SC). వాళ్లకు ఎదులాపురం గ్రామ పంచాయతీలో గల ఉన్నటువంటి బీసీల (BC) కుటుంబాలకు7 0 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అని హెచ్చరించారు