- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలి విప్లవంతో మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు
దిశ, ఇల్లందు: ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లందు మండలంలోని చల్లసముద్రం, సూదిమల్ల, గోపాల్రావుపేట, లచ్చగూడెం ఎర్ర చెరువులో మూడు లక్షల 48 వేల 500 చేపపిల్లలను వదిలారు. చల్లసముద్రం చెరువులో లక్షా 48 వేల 500 చేపపిల్లలు, సూదిమల్ల చెరువులో 45 వేలు, గోపాల్రావుపేట చెరువులో 36,000 చేపపిల్లలు, నాయకన్‌గూడెంలో 81000 వేలు, లచ్చగూడెం ఎర్రచెరువులో 39 వేల చేపపిల్లలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు చేయూతనందించి వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా సబ్సిడీపై గొర్రెలు, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందని తెలిపారు. నీలి విప్లవంలో భాగంగా ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, రైతు సమన్వయ సమితి సభ్యులు పులిగండ్ల మాధవరావు, జెడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, చల్లసముద్రం సర్పంచ్ చుక్కమ్మ, వైస్ ఎంపీపీ ప్రమోద్ పాల్గొన్నారు.