ఇంటింటికి తాగు నీరందించడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే గాంధీ

by Shyam |
ఇంటింటికి తాగు నీరందించడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే గాంధీ
X

దిశ, మియాపూర్: శేరిలింగంపల్లి నియోజక వర్గం వ్యాప్తంగా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో నూతనంగా నిర్మించనున్న మంజీర వాటర్ పైప్ లైన్లు నిర్మాణ పనులపై వాటర్ వర్క్స్ డీజీఎం ఉమాపతి ,కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. నల్లగండ్లలో అసంపూర్తిగా మిగిలిపోయిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. కాలనీ లో ప్రతి ఇంటికి తాగు నీరు అందేలా ప్రణాళికలు తయారు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జల మండలి అధికారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story