జర్మనీ నుంచి ఎమ్మెల్యే రాకపోతే సజీవదహనం అవుతా

by Sridhar Babu |   ( Updated:2021-03-25 01:43:57.0  )
జర్మనీ నుంచి ఎమ్మెల్యే రాకపోతే సజీవదహనం అవుతా
X

దిశ, వేములవాడ: ప్రజలు ఓటు వేస్తే గెలిచి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఏడాదిగా జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యే వేములవాడకు తిరిగి రాకపోతే సజీవ దహనం చేసుకుంటాననీ ఓ సామాజిక కార్యకర్త దీక్షకు పూనుకున్నాడు.

ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన రమేష్ బాబు చట్టాన్ని ఉల్లంఘించి ఏడాదైనా పత్తా లేకుండా పోయాడని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలు అవస్థలు పడుతున్న పట్టించుకోకుండా జర్మనీలోనే ఉంటున్నాడు. ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవలు చేయాల్సిన నాయకుడు జాడలేకుండా పోతే పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. రెండో దఫా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో ప్రజల బాగోగుల గురించి వదిలేసి జర్మనిలో ఉంటున్న ఎమ్మెల్యే మాకేందుకు.. అధికారులు స్పదించి వెంటనే ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలనీ దీక్ష చేస్తున్నట్టు తెలిపారు.

అధికార బలంతో ఓట్ల సమయంలో మాత్రమే వేములవాడ లో కనిపిస్తాడు. మరీ మిగతా పదవీ కాలాన్ని వృథా చేస్తూ ఎక్కడకి పోతున్నాడో నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా పోతుందన్నారు. అలాగే ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ప్రజలు, కార్మికులు, కర్షకులు కలసి రావాలని కోరారు. ఎమ్యెల్యే వేములవాడకు వచ్చేలా కలెక్టర్ స్పందించక పోతే గురువారం సాయంత్రం వరకు చూసి, పెట్రోల్ పోసుకొని సజీవదహనం చేసుకుంటాననీ హెచ్చరించారు. ఒక వేళ రమేష్ బాబు రాకపోతే ఎమ్మెల్యే తో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు నా చావుకు కారణమని సూసైడ్ నోటు రాసి చనిపోతానని హెచ్చరించారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed