- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డాక్టర్ లేడని.. ఎమ్మెల్యే ఆపరేషన్!
దిశ, వెబ్ డెస్క్: భూమి మీద నూకలుంటే ఎన్ని గండాలున్నా బయటపడొచ్చు. విపత్తు సమయంలో యాదృచ్చికంగా జరిగిన ఓ సన్నివేశం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఓ మహిళ పురిటి యాతన అనుభవిస్తుంది. అందుబాటులో డాక్టర్లు లేరు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో… భూకంప బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే సిజేరియన్ చేసి తల్లీ బిడ్డల్ని కాపాడారు. ఈ ఘటన మిజోరాం రాష్ట్రంలోని చాంఫాయిలో జరిగింది.
ఈ జిల్లా ఇటీవల భూకంపానికి గురైంది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి ఎమ్మెల్యే జీఆర్ థియామ్‌సంగా ఈ ప్రాంతంలో పర్యటించారు. అదే సమయంలో డెలివరీ సమస్య ఎదుర్కొంటున్న 38ఏళ్ల యువతిని ఆయన కలిశారు. సమయానికి డాక్టర్లు అందుబాటులో లేరని తెలుసుకున్న థియామ్‌సంగా.. తానే అత్యవసర సిజేరియన్ చేయడానికి రెడీ అయ్యారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజకీయాల్లోకి రావడానికి ముందు థియామ్‌సంగా గైనకాలజీలో స్పెషలిస్ట్ వైద్యునిగా పని చేసేవారు.