- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆనందయ్య మందు.. ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఇక్కట్లు
దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మంచి చేద్దామనుకుని ఇక్కట్లు కొని తెచ్చుకున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య కరోనా మందు ఉచితంగా పంచిపెట్టాలని ఆయన తీసుకున్న నిర్ణయం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
కరోనా బాధితుల కోసం నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును కనుగొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవసరమున్నవారికి ఈ మందు పంపిణీ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రజలకు ఆనందయ్య మందును ప్రత్యేకంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య అనుచరులతో నియోజకవర్గంలోనే మందు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ మందులోకి కావాల్సిన మూలికలు అతి కష్టం మీద సంపాదించారు. ఏపీ సీఎం జగన్, ఆయన ఫొటోలతో స్పెషల్ డబ్బాల్లో ప్యాకింగ్ చేసి ఇంటింటికీ అందజేశారు.
దీంతో ఆనందయ్య చెవిరెడ్డి ముందుకు బాగా పబ్లిసిటీ పెరిగింది. ఈ క్రమంలో తమకు కూడా ఆనందయ్య మందు కావాలని సొంత, ఇతర పార్టీ నేతల నుంచి చెవిరెడ్డికి కాల్స్ రావడం మొదలయ్యాయి. పక్క రాష్ట్రమైన తెలంగాణ నేతలు కూడా కాల్స్ చేస్తున్నారట. ఇక అధికారులు, సన్నిహితుల గురించి చెప్పాల్సిన పనిలేదు. అంచనాకు మించి రిక్వెస్టులు రావడంతో ఆయనకు ఇక్కట్లు మొదలయ్యాయి. డబ్బు ఖర్చయ్యే విషయం పక్కన పెడితే ఆ మూలికలు దొరకక తల ప్రాణం తోకకు వస్తోందని అక్కడివారు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలకే కదా ఒక రూ.50 లక్షల్లో ఖర్చు అవుతుంది. అందరికీ మందు పంపిణీ చేద్దామని మంచి ఆలోచన చేసిన ఆయనకి.. ఊహకి మించి ఆబ్లిగేషన్స్ వస్తుండటంతో మొహమాటంతో కాదనలేక ఇబ్బంది పడుతున్నారట ఎమ్మెల్యే చెవిరెడ్డి.