‘నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’

by srinivas |
‘నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
X

దిశ, అమరావతి: టీడీపీ నేత జీవీ ఆంజనేయులుకు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. రూ. 4 లక్షలకు పొలం కొనుగోలు చేసి రూ.20 లక్షలకు తాను అమ్మినట్లు ఆంజనేయులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వినుకొండకి ఇళ్ల స్థలాలు 2.7 కి.మీ మాత్రమే అయితే 7 కి.మీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తన మీద జీవీ చేసే ఆరోపణలకు చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. తమ ఇంట్లో అయినా, పార్టీ ఆఫీసులో అయినా చర్చకు రావాలని బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు.

Advertisement

Next Story