నెంబర్‌ వన్‌గా ముందుకు పోతున్నాం…

by Shyam |   ( Updated:2020-08-24 11:33:37.0  )
నెంబర్‌ వన్‌గా ముందుకు పోతున్నాం…
X

దిశ, కోదాడ: ప్రజాప్రతినిధులు సమిష్టిగా మండల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు…

ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు రైతులకు అణగారిన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, దేశంలోనే నెంబర్ వన్‌గా ముందుకు పోతున్నామని అన్నారు. అభివృద్ధి పథకాల పంపకాల్లో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed