- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోడు భూముల సమస్యపై కదం తొక్కిన ఎమ్మెల్యే హరిప్రియ
దిశ, ఇల్లందు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం మద్దులపల్లి, జాస్తిపల్లి, కెప్టెన్ బంజర గ్రామాల్లో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మంగళవారం సందర్శించారు. ఆయా గ్రామాల్లోని సర్వే నెంబర్ 185, 186 భూములు రైతులు సాగుచేస్తుండగా.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటూ రైతులను ఇబ్బందులకు చేస్తున్నారు. ఈ విషయం తెలిసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులతో మాట్లాడి, ఆదేశాలు వచ్చేంతవరకూ రైతులు పంట వేసుకోవచ్చని తెలిపారు. పంట వేయకుండా రైతులను అడ్డుకోవడం సరికాదని ఫారెస్ట్ అధికారులకు సూచించారు.
అంతేగాకుండా… రైతులను పంట వేయకుండా ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. రైతులకు తమ వ్యవసాయ పనులు ప్రారంభించాలని.. ఏ సమస్యలున్నా నేను చూసుకుంటానని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఇది మళ్లీ రిపీట్ అయితే.. రైతులతో పాటు తానూ ఇక్కడే కూర్చొని, సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలోకామేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య, ఎంపీపీ బానోత్ సునీత రాందాస్, టీఆర్ఎస్ నాయకులు కాట్రల్ల రాంబాబు, సామ మోహన్ రెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, ధనియాకుల హనుమంతరావు, వడియాల కృష్ణారెడ్డి, పుచ్చ కాయల సత్యనారాయణ, కాట్రల్ల రోశయ్య, సర్పంచులు పులసం జయమ్మ, రాంచందర్, ఎంపీటీసీలు మల్లెంపాటి నర్సింహారావు, బొడ్డు సునీత లక్ష్మీనారాయణ, సీపీఐ(ఎం) నాయకులు దుగి కృష్ణ, బత్తుల్లా వెంకటస్వామి, గడ్డం వెంకటేశ్వర్లు, యిమ్మడి రామనాథం తదితరులు పాల్గొన్నారు.