- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రగతిభవన్ సాక్షిగా.. ‘హైదరాబాద్ స్టేట్’.. ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ చైర్మన్‌గా పదవి దక్కిందనే సంబురమో.. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థకు తాను చైర్మన్ అనే భయమో.. మొత్తానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొత్త వివాదంలో కూరుకున్నారు. సొంతంగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్నే మరిచిపోయాడు. టీఆర్ఎస్ పాలనను మరిచిపోయాడో.. నిజాం పాలనలో ఉన్నట్లు అనిపించిదేమో కానీ ఆయన పేరుతో ముద్రించిన ఫ్లెక్సీల్లో హైదరాబాద్ రాష్ట్రంగా పేర్కొనడంపై మండిపడుతున్నారు. అక్కడో.. ఇక్కడో కాదు.. ఏకంగా ప్రగతిభవన్ ముందే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరో విశేషం. ఉన్నతస్థాయి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తచ్చాడే ప్రగతిభవన్ ముందు హైదరాబాద్ రాష్ట్రంగా చెప్పుకుంటూ ఆర్టీసీ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలిసి చర్చగా… రచ్చగా మారిన ఈ ఫ్లెక్సీలు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా మార్చలేదు. అయితే వివాదంగా మారడం.. మరింత ముదురుతుండటంతో ఎట్టకేలకు జీహెచ్ఎంసీ సిబ్బందితో ఈ ఫ్లెక్సీలను తొలిగించివేశారు.
నిజాం పాలన గుర్తుకు వచ్చిందా..?
బాజిరెడ్డి గోవర్ధన్ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేసీఆర్ పాలన నిజాం పాలనను మరిపిస్తుందనే భ్రమతో గోవర్ధన్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ పెట్టుతున్నారు. ఇలాంటి నేతలకు సీఎం కేసీఆర్ పదవులు ఇస్తున్నాడని, ఉద్యమం చేసి, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని దూరం పెడితే ఇలాగే నవ్వులపాలు కావాల్సి వస్తుందంటూ సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ ఫ్లెక్సీలు ఆయన అభిమానులు పెట్టినా ఇంత పెద్దగా చర్చ జరిగేది కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి. స్వయంగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరుతోనే ఏర్పాటు చేయడం, అందులో హైదరాబాద్ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా చెప్పుకోవడం వివాదమైంది. ఉదయం నుంచి ఈ ఫ్లెక్సీలు ప్రగతిభవన్ ఎదుట దర్శనమిచ్చినా.. గులాబీ నేతలు, ప్రజాప్రతినిధులు లైట్‌గా తీసుకున్నారు. కానీ సాయంత్రం నుంచి సోషల్ మీడియా వేదికగా దీనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో వీటిని పార్టీ నేతలు ముట్టుకోకుండా.. జీహెచ్ఎంసీ కార్మికులతో తొలిగించారు. అయితే ఫ్లెక్సీలకు ఫైన్లు వేసే జీహెచ్ఎంసీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ హోదాలో ఏర్పాటు చేసిన వీటిపై ఇంకా స్పందించడం లేదు. కనీసం జరిమానా అయినా వేస్తారా.. లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.