రైతులేమన్నా దొంగలా !

by srinivas |   ( Updated:2020-11-03 11:16:10.0  )
రైతులేమన్నా దొంగలా !
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని రైతులు చేసిన నేరమేమిటి ? వాళ్లేమైనా దొంగలా.. దోపిడీ దారులా.. కేసులు ఎలా పెడతారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మెజార్టీ ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. అన్ని రాష్ర్టాల్లో రైతులకు సన్మానం చేస్తుంటే ఇక్కడ బేడీలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కోసం 322రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మూడు రాజధానులను ప్రజలు వ్యతిరేకించడంతో పెయిడ్​ ఆర్టిస్టులతో వైసీపీ నాయకులు దొంగ దీక్షలు చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు.

Advertisement

Next Story