- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Chandra babu చదివిన స్కూళ్లను కూడా Jagan బాగు చేస్తున్నారు’
దిశ, ఏపీ బ్యూరో : డా.బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకవైపు సామాజిక విప్లవం మరోవైపు శాశ్వత అభివృద్ధికి అడుగులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తుంటే ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధానమని జగన్ భావిస్తున్నారని అందువల్లే విద్యారంగం బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గంలో పాఠశాలలు బాగోలేవని వార్తలు రాస్తున్నారని… ప్రభుత్వం దశలవారీగా పాఠశాలలను అభివృద్ది చేస్తున్న సంగతి వార్తలు రాస్తున్న వారికి తెలియదా? అని ప్రశ్నించారు. పాఠశాలల దుస్థితికి చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబు ఏరోజైనా కారు దిగి స్కూళ్లని పరిశీలించారా? అని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్..ఇదే తాడేపల్లిలో ఓ ఇంటిని ఆక్రమించుకుని అక్రమ కట్టడంలో ఉంటూ.. ఏనాడైనా కారులో నుంచి కిందకు ఒక్క అడుగు వేసి ప్రభుత్వ స్కూళ్ల స్థితిని పరిశీలించారా అని ప్రశ్నించారు. అయితే జగన్ పెద్ద ఎత్తున విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. పెద్దఎత్తున స్కూళ్ళను అభివృద్ధి చేస్తుంటే ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఊళ్లో నారావారిపల్లె పక్కనే చంద్రబాబు చదువుకున్న స్కూలు శిధిలావస్థకు చేరితే దాన్ని సీఎం జగన్ బాగు చేయించారన్నారు. ఈ విషయం ఎల్లో మీడియాకు కనబడదన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను చూసి ఓర్వలేక..ప్రజలకు మంచి జరగకూడదన్నట్లు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక, సంపూర్ణ పోషణ నుంచి గోరు ముద్ద వరకు ఒకవైపు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మరోవైపు విద్యార్థుల జీవితాలను మార్చేందుకు…భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా స్కూళ్ళను అభివృద్ధి చేస్తుంటే వాస్తవాలు రాయకుండా అసత్య కథనాలు రాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్న మంచి పనుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.