33 జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే అక్బరుద్దీన్

by Shyam |
33 జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులు నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు, ఓల్డ్ సిటీలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో నాలుగు నుంచి ఐదు గంటలు ఉచితంగా వైఫై సేవలు అందజేయాలని సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు 30% రాయితీ ఇవ్వడం అభినందనీయమన్నారు.

Advertisement

Next Story