ఆ పని మీరే చేయండి.. రాహుల్‌ను కోరిన స్టాలిన్

by Shamantha N |
ఆ పని మీరే చేయండి.. రాహుల్‌ను కోరిన స్టాలిన్
X

చెన్నై: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపేయేతర రాజకీయ పక్షాలను కూడగట్టడంలో చొరవ చూపాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కోరారు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సేలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశం ఫాసిస్టు పాలనలో ధ్వంసమవుతున్నది. ఈ తరుణంలో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) పై ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. వాటికి మీరు నాయకత్వం వహించాలి’ అని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికలలో దేశంలో 37 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారని, మిగిలిన 63 శాతం మంది ప్రజలు దేశంలోని వివిధ రాజకీయ పక్షాలకు మద్దతు తెలిపారని . తమిళనాడులో గత పార్లమెంటు ఎన్నికల సమయంలో తాము యునైటెడ్ సెక్యులర్ ఫ్రంట్ (యూఎస్ఎఫ్) పేరుతో తమిళనాడులో బీజేపీని మట్టి కరిపించామని, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం కానున్నాయని స్టాలిన్ జోస్యం చెప్పారు.

ఆ ముసుగు వెనుక ఉన్నది బీజేపీయే : రాహుల్ గాంధీ

ఇదే సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఈరోజుల్లో మనం ఎక్కడికెళ్లినా మాస్కులు ధరిస్తున్నాం. మాస్కు పెట్టుకున్న వ్యక్తి ఎదుటివారిని చూస్తూ నవ్వినా, ఇతర హావభావాలు మనం గుర్తించలేం. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే కూడా అదే చేస్తున్నది. మీరు కన్ఫ్యూజ్ కావొద్దు. ఇది పాత ఏఐడీఎంకే కాదు. ఏఐడీఎంకే మాస్కు తొలగించి చూస్తే మీకు కనిపించేది బీజేపీ, ఆరెస్సెస్‌లే. వాటితో జాగ్రత్త..’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed