- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఫొటో కోసం ఆరు రోజుల ఎదురుచూపు!
ఒక ఆడ చిరుతపులి, మగ బ్లాక్ పాంథర్ కలిసి గాంభీర్యంగా చూస్తున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫొటో తీసిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మిథున్ హెచ్ దీని వెనకున్న కష్టాన్ని వివరించారు. కర్ణాటకలోని కాబిని ఫారెస్ట్ రిజర్వ్‌లో ఈ ఫొటోను క్యాప్చర్ చేయడానికి మిథున్ దాదాపు ఆరు రోజుల పాటు ఎదురుచూశారట. పులులంటే ప్రత్యేక అభిమానం ఉన్న మిథున్.. ఈ చిరుతపులి, బ్లాక్ పాంథర్ జంటను గత నాలుగేళ్లుగా అనుసరిస్తున్నాడు. ఇందులో చిరుతపులి పేరు క్లియోపాత్రా, బ్లాక్ పాంథర్ పేరు సాయా. 2009లో క్లియోపాత్రా ఈ కాబిని ఫారెస్ట్‌కు వచ్చింది. అది చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి మిథున్ దాన్ని ఫాలో అవుతున్నారు. అంటే దాదాపుగా 12 ఏళ్ల నుంచి మిథున్ దాని అడుగుజాడలను పసిగడుతున్నాడన్నమాట.
2014లో ఈ బ్లాక్ పాంథర్ సాయాను తీసుకొచ్చారు. ఇవి రెండు 2016లో దగ్గరయ్యాయి. ఇక అప్పటి నుంచి వాటిని మిథున్ ఫొటోలు తీస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది అవి మేటింగ్ కోసం కలిసినపుడు మిథున్ ఫొటోలు తీసేవాడు. కానీ ఈసారి తీసిన ఫొటో మాత్రం చాలా ప్రత్యేకంగా వచ్చింది. ఈ ఫొటో కోసం వాటికి 100 అడుగుల దూరంలో మిథున్ ఆరు రోజుల పాటు ఒకే ప్రదేశంలో పడిగాపులు కాశారట. అప్పుడే ఒక జంతువును వేటాడి తిని, మేటింగ్ పూర్తి చేసుకున్నాక అవి రెండూ ఒకేసారి కెమెరా వైపు తిరిగి చూసినపుడు తన ఆరు రోజుల ఎదురుచూపులో ఆరేళ్ల కష్టం ఫలించిందని మిథున్ అంటున్నారు. ఇప్పటికీ తను కళ్లు మూసుకుంటే ఆ దృశ్యమే కనిపిస్తోందని ఆయన చెబుతున్నారు.