- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథ పనులతో ప్రమాదాలు.. పట్టించుకోరా..?
X
దిశ, మంచిర్యాల: మిషన్ భగీరథ పనులతో ప్రజలకు నీళ్లు రావడం మాట పక్కనబెడితో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పైప్ లైన్ కోసం తవ్విన కాలువలు సరిగ్గా పూర్తి చేయకపోవడం, అక్కడక్కడా పైపులైన్లు పగిలి జనం ఇక్కట్ల పాలవుతున్నారు. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో షాపింగ్ కోసం వచ్చిన వారు, స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గంగారెడ్డి రోడ్డు నుంచి అర్చన టెక్స్ వరకు జరిగిన పైప్ లైన్‌లను సరిగ్గా బిగించకపోవడంతో నీరు లీక్ అవుతోంది. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనుల వల్ల కాలనీల్లో, రహదారిలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. గుంతలను పూడ్చి.. సరిగ్గా చదును చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story