ఒకరి వెనక మరొకరు.. మిడ్ మానేరులో ఇద్దరు గల్లంతు

by Sridhar Babu |
Mid Manor
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు మిడ్ మానేరులో గల్లంతయ్యారు. ఒకరు మనస్థాపంతో డ్యాంలో దూకగా.. మరొకరు అతడి కోసం చూస్తూ పట్టుతప్పి పడిపోయారు.

కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌కు చెందిన సాయికృష్ణ మనస్థాపంతో కోదురుపక బ్రిడ్జిపై నుంచి మానేరులో దూకినట్లు సమాచారం. అయితే సాయికృష్ణ డ్యాంలో దూకడాన్ని గమనించిన రాజశేఖర్.. అతడి కోసం డ్యాం లోపలికి చూస్తుండగా పట్టతప్పి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పడిపోయాడు. దీంతో ఇద్దరు డ్యాం నీటిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

Next Story