- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. అదృశ్యమైన బాలికలు చెరువులో విగతజీవులుగా..
by Anukaran |
X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా తానూరు మండలం సింగన్‌గావ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఈ రోజు ఉదయం చెరువులో విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… సింగన్‌గావ్ గ్రామానికి చెందిన ఓ మహిళ, తన ఇద్దరు పిల్లలతో పాటు చుట్టం చూపుగా వచ్చిన ఇంకో అమ్మాయి కలిసి వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. ‘సాయంత్రం అవుతోంది.. మీరు ఇంటికి వెళ్లండి’ అని తల్లి చెప్పడంతో సదరు పిల్లలు సునీత (16), వైశాలి (14), అంజలి (14) ఇంటి బాట పట్టారు. కానీ, ఎంతకీ చేరుకోలేదు. రాత్రంతా గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోవడంతో.. కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం గాలింపు చేస్తున్న సమయంలో.. చెరువు గట్టుపై చెప్పులను గమనించారు గ్రామస్తులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి.. మృతదేహాలను వెలికితీశారు. సెల్ఫీ దిగుతున్న సమయంలో ముగ్గురు పిల్లలు నీటిలో పడిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. పిల్లల మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదమా.. హత్య జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు.
Advertisement
Next Story