అరేబియాలో ఇంకా 37 మంది మిస్సింగ్

by vinod kumar |   ( Updated:2021-05-20 20:12:23.0  )
P305 barge
X

ముంబై: తౌక్టే తుఫాన్ కారణంగా ముంబై తీరానికి పదుల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చిక్కుకున్న పీ305 బార్జ్ మునిగిపోవడంతో దానిపైనున్న వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలు లభ్యమైనట్టు భారత నావికాదళం వెల్లడించింది. పీ305 బార్జ్, వరప్రభ టగ్ బోట్ నుంచి మిస్ అయిన 37 మందికోసం ఇంకా గాలిస్తున్నట్టు తెలిపింది. కనీసం మరో మూడు రోజులైనా సెర్చ్ ఆపరేషన్ చేపడుతామని ఇండియన్ నేవీ కమాండర్ అజయ్ ఝా వివరించారు.

Advertisement

Next Story