యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగం సక్సెస్

by Shamantha N |
యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగం సక్సెస్
X

న్యూఢిల్లీ: వరుస ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత నావికాదళం తాజాగా, యాంటీ-షిప్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని ఇండియన్ నేవీ బంగాళాఖాతంలో శుక్రవారం నిర్వహించింది. నావికా దళానికి చెందిన యుద్ధనౌక కోరా నుంచి వెలువడిన ఈ యాంటీ-షిప్ మిసైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో లక్షిత నౌక పేలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇండియన్ నేవీ ట్విట్టర్‌లో విడుదల చేసింది. ‘భారత నావికా దళానికి చెందిన గైడెడ్ మిసైల్ కార్వెటీ ఐఎన్ఎస్ కోరా నుంచి ప్రయోగించిన యాంటీ షిప్ మిసైల్ గరిష్ఠ పరిధిలోని తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. టార్గెట్ షిప్ తీవ్రంగా ధ్వంసమైంది, మంటల్లో చిక్కుకుంది’ అని పేర్కొంది.

Advertisement

Next Story