షాకింగ్ : బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఊడిన టైర్లు.. ఎందుకంటే ?

by srinivas |
షాకింగ్ : బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఊడిన టైర్లు.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రామవరంలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని రామవరం మండలం ఎడ్లకొండ వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న బస్సు వెనక చక్రాలు ఆకస్మాత్తుగా ఊడిపోయాయి. దీంతో పెద్ద శబ్ధం రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తంగా వ్యవహరించి బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గోకవరం నుంచి మారేడు మిల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. బస్సుల ఫిట్ నెస్ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Next Story