- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం..
దిశ, స్టేషన్ ఘన్ పూర్: ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుండి పాట్నా మీదుగా దానాపూర్ (02791) వెళుతున్న దానాపూర్ ఎక్స్ ప్రెస్ మంగళవారం స్టేషన్ ఘన్ పూర్ స్టేషన్ లో ఇంజన్ నుండి భోగిలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మన్నారు.
స్టేషన్ ప్లాట్ ఫామ్ చివరి వరకు బోగీలు నిలిచిపోగా ఇంజన్ మాత్రం దాదాపు 200 మీటర్ల ముందుకెళ్లి నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న లోకో పైలెట్ ఇంజన్ ను వెనక్కి తీసుకు వచ్చి భోగి లను జత చేసుకుని తిరిగి కాజీపేటకు బయలుదేరింది. ఇంజన్ రైలు బోగి లతో వేరు అవడంతో అధికారులు సైతం ఆందోళనకు గురయ్యారు అర్ధ గంట పాటు ఆలస్యం జరిగినప్పటికీ ఇండియన్ వెనక్కి తీసుకు వచ్చి బోగీలకు జతచేసి ముందుకు వెళ్లేందుకు రైల్వే సిబ్బంది పచ్చజెండా ఊపారు. అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.