'శ్రీమంతుడు' సినిమా ఎఫెక్ట్: రాజకీయాల్లోకి మిస్ ఇండియా రన్నరప్!

by Anukaran |   ( Updated:2021-04-03 06:05:23.0  )
శ్రీమంతుడు సినిమా ఎఫెక్ట్: రాజకీయాల్లోకి మిస్ ఇండియా రన్నరప్!
X

దిశ, సినిమా : మిస్ ఇండియా టైటిల్ సొంతం కాగానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. నంబర్ ఆఫ్ యాడ్స్‌తో బిజీ బిజీగా గడుపుతూ లక్షల్లో, కోట్లలో సంపాదించేస్తుంటారు. పార్టీలు, పబ్‌లు అంటూ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మిస్ ఇండియా 2015 రన్నరప్ దీక్షా సింగ్ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రయత్నిస్తోంది. ‘శ్రీమంతుడు’ సినిమా స్టైల్‌లో ‘ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయాలి లేక పొతే లావైపోతారు’ డైలాగ్‌ను ఫాలో అయిపోతూ.. సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. అనుకున్నదే తడవుగా ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే పంచాయితీ ఎన్నికల్లో జౌన్‌పూర్ నుంచి పోటీ చేసి గ్రాండ్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

భక్ష ఏరియా చిత్తోరి విలేజ్‌కు చెందిన దీక్షా సింగ్.. మూడో తరగతి వరకు అదే గ్రామంలో చదువుకుంది. ఆ తర్వాత తండ్రితో పాటు ముంబై వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి వెళ్లి గోవాలో సెటిల్ అయిపోయింది. అయితే ఎంత దూరం వెళ్లినా ఎప్పటికప్పుడూ సొంత గ్రామాన్ని సందర్శించే ఈ భామ.. గ్రామం అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. దానికి రాజకీయాలే కరెక్ట్ అనుకుంది. కాలేజీ రోజుల నుంచే రాజకీయ చర్చల్లో పాల్గొంటున్న దీక్ష.. సమాజం, ప్రజా సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని తెలుసుకొని భక్ష వార్డ్ నంబర్ 26 నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకుంది. జౌన్‌పూర్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందని.. ఎంతో కొంత మార్పు తీసుకొచ్చేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పింది.

కాగా దీక్ష నటించిన ‘రబ్బా మెహర్ కరే’ ఆల్బమ్ ఫిబ్రవరిలో రిలీజ్ అవగా.. 50 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ‘ఇష్క్ తేరా’ సినిమాకు కథ కూడా అందించిన దీక్ష.. బిగ్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్స్ చేస్తోంది. త్వరలో ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్‌ కూడా రిలీజ్ కానుంది. మొత్తానికి రాజకీయ రంగంలో గ్లామర్ డాల్ రావడం స్థానికంగా సంచలనం రేపుతోంది. మరి ఈ భామ రాజకీయాలలో ఎలాంటి గెలుపును సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed