- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ ప్రభుత్వం వలన డిప్రెషన్‌తో బాధపడుతున్నా! : మిచెల్ ఒబామా
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కారణంగా తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా అన్నారు.ప్రస్తుతం దేశంలో ప్రబలుతున్న కరోనా మహమ్మారితో పాటు, వర్ణవివక్ష పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిచెల్ ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమెరికాలో నల్లవారు మానసికంగా అనుభవించే ఇబ్బందులన్నీ నాకు తెలుసు. నేను కూడా పరిస్థితుల వల్ల కొంత డిప్రెషన్‌కు లోనవుతున్నాను. అర్థరాత్రిళ్లు ఉలిక్కిపడి నిద్ర నుంచి మేలుకొంటున్నాను. మరికొన్ని సార్లు చుట్టుపక్కల పరిస్థితులను చూసి మానసికంగా ఆందోళన కలుగుతోందన్నారు.
అయితే, వీటన్నింటితో నేను పోరాడుతున్నాను. నాలానే ఇక్కడ అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి అని ఆమె పేర్కొన్నారు. మిచెల్ వ్యాఖ్యలను అనేకమంది ట్విటర్ వేదికగా అభినందించారు. అమెరికాలోని పరిస్థితుల గురించి, డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడినందుకు ఆమెను ప్రశంసించారు.