స్విమ్ సూట్‌లో బాలీవుడ్ హీరో వైఫ్.. స్టన్నింగ్ లుక్స్

by Jakkula Samataha |
స్విమ్ సూట్‌లో బాలీవుడ్ హీరో వైఫ్.. స్టన్నింగ్ లుక్స్
X

దిశ, సినిమా : బీటౌన్‌ స్టార్ హీరోల వైవ్స్‌ విషయానికొస్తే.. మిగతావారితో పోలిస్తే షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్‌పుత్‌కే అందరికంటే ఎక్కువ క్రేజ్, ఫాలోయింగ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మీర.. తన భర్తతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌తో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా స్విమ్ సూట్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి, ఇంటర్నెట్‌ను మెల్ట్ చేసేసింది. ‘మినట్స్ బిఫోర్ ద మెస్’ అనే క్యాప్షన్‌తో తన మోకాళ్లు కనిపించేలా ఉన్న గ్లామరస్ ఫొటోలో ట్విన్ కలర్ స్విమ్ సూట్‌తో హాట్‌గా దర్శనమిచ్చింది.

ఇటీవల షాహిద్ కపూర్ స్విమ్మింగ్ పూల్‌లో తీసిన ఫొటోలు షేర్ చేయగా, ప్రస్తుతం మీరా తన ఇన్‌స్టాలో ఈ ఫొటోలు పోస్ట్ చేసింది. ఇక షాహిద్ తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్, ఇటీవలే నేషనల్ అవార్డు గెలుచుకున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ని అదే డైరెక్టర్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జోడీగా నటించగా, హిందీలో షాహిద్ కపూర్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు.

Advertisement

Next Story