యువకుడి వేధింపులు.. చంపేస్తానని బెదిరింపు.. చివరకు సీన్ రివర్స్

by Sumithra |   ( Updated:2021-08-14 05:30:15.0  )
యువకుడి వేధింపులు.. చంపేస్తానని బెదిరింపు.. చివరకు సీన్ రివర్స్
X

దిశ, నర్సంపేట: ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నారావుపేట మండలంలోని కల్ నాయక్ తండాలో చోటుచేసుకుంది. ట్రైనీ ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం… కల్ నాయక్ తండాకి చెందిన బానోతు రవీందర్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా అదే తండాకి చెందిన మైనర్‌ను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తానని పలుమార్లు బెదిరింపులకు దిగాడు. రెండు రోజుల కిందటి నుండి ఈ వేధింపులు మరింత తీవ్ర మయ్యాయి. రవీందర్ చేష్టలతో తీవ్ర మనస్తాపం చెందింది మైనర్ బాలిక. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం వరంగల్ లోని ఎం.జీ.ఎం ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శుక్రవారం సాయంత్రం ఆ మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.

Advertisement

Next Story