ఆడుకునేందుకు వచ్చిన నాలుగేండ్ల చిన్నారిని వదల్లేదు..

by Sumithra |
Rape attempt
X

దిశ, అశ్వారావుపేట: ఆడుకునేందుకు ఇంటికి వచ్చిన నాలుగేండ్ల చిన్నారిపై మైనర్ బాలుడు రేప్ అటెంప్ట్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. దమ్మపేట మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై.. ఇంటి పక్కనే ఉండే 15 ఏండ్ల మైనర్ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే కాలనీకి చెందిన 15 ఏండ్ల బాలుడు ఇంట్లో ఉన్న సమయంలో.. పక్క ఇంట్లో ఉండే నాలుగేండ్ల చిన్నారి వచ్చింది. తెలిసి తెలియని వయస్సులో ఏదో ఆటలో నిమగ్నమైన చిన్నారిపై సదరు బాలుడు రేప్ అటెంప్ట్ చేశాడు. దీంతో బాధితురాలు గట్టిగా ఏడ్చేసింది. ఆ తర్వాత అస్వస్థతకు గురి అయింది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారయత్నం జరిగినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు సదరు బాలుడిపై ఫిర్యాదు చేయగా.. దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story