- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షూటింగ్‌లో గాయపడిన హీరో అజిత్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ‘వలిమై’ సినిమా కోసం బైక్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా .. రోడ్డు బాగా లేకపోవడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అజిత్ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరిచేందుకు సినిమాల్లో తనే బైక్ స్టంట్స్ చేస్తారు. ఈ క్రమంలోనే చెన్నైలో ‘వలిమై’ సినిమా కోసం బైక్ స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో స్వల్ప గాయాలు కాగా… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు తాలా అజిత్. దీంతో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ .. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
అజిత్ ఆరోగ్యం మెరుగుపడగానే మరో షెడ్యూల్ ఉంటుందని తెలిపింది చిత్ర యూనిట్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాత. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. గౌతమ్ మీనన్ ‘ఎన్నై అరిందాల్’ సినిమా తర్వాత ‘వలిమై’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు అజిత్.