Accreditation: అక్రెడిటేషన్ల గడువు పెంపు ఉత్తర్వులు జారీ

by Prasad Jukanti |   ( Updated:2025-03-24 12:07:54.0  )
Accreditation: అక్రెడిటేషన్ల గడువు పెంపు ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టులకు జారీ చేసిన అక్రెడిటేషన్ల (గుర్తింపు కార్డు) గడువు చెల్లింపును మరో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఉన్న అన్ని రాష్ట్ర జిల్లా జర్నలిస్టుల అక్రెడిటేషన్లగడువును 30 జూన్ 2025 వరకు పొడిగించింది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హరీశ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న అన్ని రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల బస్ పాస్ చెల్లుబాటు వ్యవధిని 30 జూన్ వరకు పొడిగించాలని ఇందుకు ఆర్టీసీకి ఐఅండ్ పీఆర్ కమిషనర్ సమాచారం ఇచ్చారు. కాగా అక్రెడిటేషన్ల ల గడువు పొడిగించడం ఇది నాలుగో సారి.

Next Story

Most Viewed