CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారు

by M.Rajitha |   ( Updated:2025-03-24 11:21:08.0  )
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జపాన్ పర్యటన(Japan Tour) ఖరారైంది. ఏప్రిల్ రెండవ వారంలో సీఎం రేవంత్ రెడ్డి వారం రోజులపాటు జపాన్ లో పర్యటించనున్నారు. ఒసాకలో జరిగే వరల్డ్ ఎక్స్‌పో(Osaka World Expo 2025)లో రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి పాల్గొంటారు. ఏప్రిల్ 13న మొదలవనున్న ఈ పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), అధికారులు, మరికొంత మంది ఉండనున్నారు. కాగా ప్రపంచ ఎక్స్‌పోలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి BIE అనే సంస్థ ద్వారా నిర్వహించబడతాయి. ఇవి ఆరు నెలల పాటు జరుగుతాయి. చివరిగా ఇది 2021-22లో దుబాయ్‌లో జరిగింది. ఈ సంవత్సరం జపాన్‌లోని ఒసాకాలో 2025 ఏప్రిల్ 13 నుండి మొదలవుతుంది. ప్రపంచ ఎక్స్‌పో 2025, ఒసాకా, జపాన్ లోని సముద్రం ఒడ్డున ఉన్న ఒక కృత్రిమ ద్వీపంలో జరుగుతుంది. దీని థీమ్ "మన జీవితాల కోసం భవిష్యత్ సమాజాన్ని సిద్ధం చేయడం". ఇందులో.. జీవితాలను కాపాడడం, జీవితాలను బలపరచడం, జీవితాలను అనుసంధానం చేయడం వంటి ఉప థీమ్స్ ఉన్నాయి.

Next Story