- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాష్ట్రంలో ఇట్ల ఎక్కడా లేదు'
దిశ, మహబూబ్ నగర్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ లాక్ డౌన్ సమయంలో ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో 50 మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని అన్నారు. పాస్టర్లు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో క్రైస్తవుల కోసం క్రైస్తవ భవానాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే దానిని ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు రాజేశ్వర రావు మాట్లాడుతూ పాస్టర్లకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శామ్యూల్ రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మోడ్రన్ బేకరీ మోహిసిన్ ఖాన్ ఆధ్వర్యంలో మోడరన్ బేకరీ వద్ద మంత్రులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.