- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తాం…
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సంపద సృష్టించేందుకే చెరువులు, రిజర్వాయర్‌లలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నారు. మంగళవారం ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంపద సృష్టించి కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. మత్స్య కారులకు కావల్సినటువంటి మోపెడ్‌లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్ బాక్సులు అందిస్తుందన్నారు.
మత్స్య రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం సోన్ మండలం పాక్ పట్లలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాడి పాడిపశువుల జాతీయ కృత్రిమ గర్భధారణ రెండో దశ కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు పాల్గొని గొర్రెలకు నట్టల మందులను వేశారు.