- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను హామీ ఇస్తున్నా… : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం గీత కార్మికులకు చేయూతనిస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం వరంగల్ అర్భన్ జిల్లాహన్మకొండ హంటర్ రోడ్ లోని కాకతీయ గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ లో 50 వేల మంది గీత కార్మికులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నాం కానీ కరోనా వల్ల సాధ్యం కాలేదన్నారు. నీరాను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వం అన్ని కుల వృతులను ఆదుకుంటుందన్నారు. హైదరాబాద్ మహా నగరంలో గౌడ కులస్తులకు ప్రభుత్వం స్థలం కేటాయించిదన్నారు. వరంగల్ కాకతీయ హాస్టల్ లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.