అడ్డంగా బుక్కైన మంత్రులు.. వీడియో వైరల్!

by Anukaran |   ( Updated:2021-07-15 05:10:14.0  )
trs-flag 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రులు గుట్కా తీసుకున్నారంటూ ఓ వీడియో క్లిప్‌ను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్​ ఇద్దరూ ఉన్నారు.

మధ్యలో మరో మంత్రి శ్రీనివాస్​గౌడ్​కూడా వీడియో దర్శనమివ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.“ తెలంగాణాలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది..? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు..? ఎట్లా సప్లై చేస్తుండ్రు..? బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా..?” అని దాసోజ్ శ్రవణ్ ప్రశ్నించారు.

రెచ్చిపోయిన రాములు నాయక్.. అనుచరులపై దాడి

Advertisement

Next Story